WTC Final: వరుసగా మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలనే టీమిండియా ఆశలు నెరవేరడం కష్టంగా మారిపోయింది. ఓ దశలో వరుసగా ఆరు టెస్టు విజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తిరుగులేని ఆధిక్యంలో కొనసాగిన భారత్.. ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఐదు టెస్టుల్లో నాలుగు ఓడిపోవడంతో ఫైనల్‌కు వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో ఘన విజయంతో తిరిగి పట్టికలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా.. అడిలైడ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి థర్డో ప్లేస్ కి పడిపోయింది.
Read Also: Mega Family : ఆనందంలో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే.!
ఇక, భారత జట్టు పాయింట్ల శాతం 61.11 నుంచి 57.29కి తగ్గిపోయింది. పాయింట్ల శాతాన్ని 57.69 నుంచి 60.71కి పెంచుకున్న ఆసీస్ సెకండ్ ప్లేస్ కి పోయింది. ఇక, తాజాగా శ్రీలంకపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా 63.33 పాయింట్లతో నెంబర్ ర్యాంకును దక్కించుకుంది. టాప్-2లో నిలిచే టీమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నాయి.
Read Also: Minister Narayana: వారికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. అద్భుతాలు చేయడం తెలియదు..
కాగా, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయిన తర్వాత.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినా కూడా టీమిండియా ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ ఆ దిశగా టీమ్ అసాధారణ ప్రదర్శన చేయాలి. ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ కు దక్షిణాఫ్రికా దాదాపుగా అర్హత సాధించినట్లే.. ఈ డబ్ల్యూటీసీలో తమ తొలి ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటే గెలిచి రేసులో వెనుకబడ్డ సౌతాఫ్రికా ఆ తర్వాత అనూహ్యంగా ఐదో టెస్టు విజయంతో నెంబర్ స్థానానికి దూసుకుపోయింది. ఫైనల్ చేరేందుకు ఆ టీమ్ కు మరో గెలుపు అవసరం. ఈ నెలలో సొంతగడ్డపై పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీ జట్టు ఒక్క మ్యాచ్ నెగ్గినా చాలు.
Read Also: Rajnath Singh: నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
అయితే, దక్షిణాఫ్రికా దూకుడుతో భారత జట్టుకు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోయాయి. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో తర్వాత జరిగే మూడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. భారత్ 4-1తో సిరీస్ గెలిస్తే 64.05 పాయింట్లతో.. 3-1తో విజయం సాధిస్తే 60.52 పాయింట్లతో ఆసీస్‌ను దాటి టైటిల్ పోరుకు ఇండియా అర్హత సాధిస్తుంది.