Kohli vs Konstas: ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు హీటెక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్లేయర్ సామ్ కాన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, కాన్‌స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడంతో గొడవకు దారి తీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపు చేశారు. కానీ, కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రియాక్ట్ అయ్యారు. కాన్‌స్టాస్ తన దారిన తాను వెళ్తుంటే.. విరాట్ మాత్రం తన డైరక్షన్‌ను మార్చుకుని.. సదరు ప్లేయర్ భుజాలు తాకడం మంచిది కాదని తెలిపారు. ఈ ఘటనలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలని మైకెల్ వాన్ పేర్కొన్నాడు.
ఇక, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ కాన్‌స్టాస్ క్రీజ్‌లో ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్న సమయంలో కోహ్లీ వద్దకు బాల్ వెళ్లింది.. దానిని తీసుకుని నాన్‌స్ట్రైకర్ వైపు వస్తుండగా.. స్ట్రైకింగ్ క్రీజ్ వైపు కాన్‌స్టాస్ వెళ్తుండగా.. వీరిద్దరూ ఎదురుపడటంతో భుజాలు తాకాయి. దీంతో కాన్‌స్టాస్ ఏదో కామెంట్స్ చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా రియాక్ట్ అయ్యాడు. కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొనడంతో.. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
ఈ ఘటనపై ఒకవేళ ఐసీసీ రిఫరీ చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ ల్లో ఆసక్తి రేపుతోంది. రూల్స్ ప్రకారం.. ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అలాగే, ప్లేయర్, సహాయ సిబ్బందిని, అంపైర్‌ను, మ్యాచ్ రిఫరీని లేదా ఇతర వ్యక్తిని దురుద్దేశంతో కావాలని తాకితే ఐసీసీ చట్టం 2.12 ఆర్టికల్ ప్రకారం శిక్షకు అర్హుడు. ఇందులో ఒక్క మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉంటది. తన తప్పును అంగీకరిస్తే డీమెరిట్ పాయింట్లతో బయట పడే అవకాశం ఉంటుందని ఐసీసీ రూల్స్ పేర్కొంటున్నాయి.