బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతనిపైనే అన్నీ ఆశలు ఉండేవి. ఇంతకుముందు జరిగిన బీజీటీలో ఆసీస్‌కు చుక్కలు చూపించిన స్టార్ క్రికెటర్.. అన్నీ టెస్టుల్లోనూ విఫలమవుతున్నాడు. దీంతో.. క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. బ్రిస్బేన్‌లో పరుగుల వరద పారిస్తాడనుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు కేవలం 3 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచాడు. జోస్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో.. కోహ్లీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
Kia Syros SUV: ఈ వారమే విడుదల… అదిరిపోయిన ఫీచర్లు..!
అటు.. పెర్త్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని సెంచరీ సాధించాడు. ఆ తర్వాత.. అడిలైడ్‌లో మళ్లీ నిరాశే మిగిల్చాడు. తాజాగా.. బ్రిస్బేన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా చేతులెత్తేశాడు. ఈ క్రమంలో.. విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకోవాలని కోహ్లీకి సలహాలు ఇస్తున్నారు. ధోనీని చూసి నేర్చుకుని రిటైర్మెంట్ తీసుకోవాలని కోహ్లీకి చెబుతున్నారు. 2014లో ఆస్ట్రేలియా టూర్‌లో ధోని మధ్యలోనే రిటైరయ్యాడు. ఈ క్రమంలో.. నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఎక్స్‌లో.. “విరాట్ కోహ్లీ ధోని నుండి నేర్చుకుని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలి. ఒకప్పుడు గొప్పగా ఉన్న బీసీసీఐ.. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లపై ఎందుకు సమయాన్ని వృధా చేస్తుంది.” అని అన్నాడు. మరో వినియోగదారు.. “ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాలి. వర్షం కారణంగా ఈ ఇన్నింగ్స్ జరగకపోతే.. కోహ్లీ తదుపరి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాలి, లేకపోతే రిటైర్ కావాలి.” మరొక వినియోగదారు “రిటైర్ అయ్యి లండన్‌లో నివసించు” అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Virat Kohli has lost the hunger to score runs. No other reason 💔 pic.twitter.com/TQrLViSQhJ
— Dinda Academy (@academy_dinda) December 16, 2024
బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. విరాట్‌తో పాటు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఔట్ అయి నిరాశపరిచారు. వర్షం టీమిండియాను రక్షించింది లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
Virat kohli retire and stay at London forever
— Dhaanush (@SuperSportsmass) December 16, 2024