Australia announce fresh squad for Last Two T20s: భారత్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. నేడు మూడో టీ20 జరగనుంది. ఈ సిరీస్ డిసైడర్ మ్యాచుకు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. స్టీవ్ స్మిత్, ఆడం జంపాలు నేడు స్వదేశానికి వెళుతున్న నేపథ్యంలో మూడో టీ20 ఆడడం లేదు. మంగళవారం గౌహతిలో జరిగే మూడో టీ20 తర్వాత గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్…
ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా రెండో టీ20లో ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్ పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యా్న్ని ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు.
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది.
రోహిత్ శర్మ లాగే తాను కూడా టీమ్ కు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదన్నాడు.
విశాఖ వేదికగా రేపు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. వైజాగ్ లోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.