ఓవైపు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తుండగా, మరోవైపు 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చంద్రబాబు A1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా స్పందించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు, ఇంకా అలైన్మెంట్ మార్పు ఎక్కడినుంచి వస్తుంది? అంటూ ప్రశ్నించారు. రోడ్డేసినట్టు, అలాగే దాని వల్ల చంద్రబాబు మనుషులకు ఏదో లబ్ది చేకూరినట్టు వైసీపీ ప్రభుత్వం భ్రమలు…
ఏపీలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉంది. ప్రజల మద్దతు టీడీపీకి ఉంది. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ వైఫల్యం చెందారన్నారు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది.ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ…
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారా.?తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో ఎన్నికల్లో గెలవడానికి కన్నూమిన్నూ కానకుండా హామీలిచ్చారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి. జగన్ చేసిన…
ఏపీ మంత్రివర్గ విస్తరణ విమర్శల పాలవుతోంది. ప్రతి పక్షాన్ని తిట్టేందుకేనా మంత్రులు వున్నదని తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్. ప్రజలకు పని చేయటం కోసం మంత్రి పదవులివ్వలేదన్నది కెబినెట్ చూస్తే అర్థమవుతోంది. ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కాలంటే అవినీతి, మాఫియా, భూకబ్జాలే అర్హతలు అన్నారు. Also Read: Atchannaidu: ఆక్వారంగాన్ని ఉరితీసిన జగన్ వైఎస్ కుటుంబాన్ని తిట్టిన వాళ్లకూ మంత్రివర్గంలో చోటు కల్పించారు. వైఎస్ దోపిడీని బయటపెట్టడం లేదా కలిసి దోపిడీ…
ఏపీ కేబినెట్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు కేబినెట్ పై మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయి రెడ్డిలకు పంచాక బీసీలకు ఎన్ని మంత్రి పదవులిస్తే ఏం లాభం..? అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారం తమ చేతుల్లో పెట్టుకుని బీసీ మంత్రులను కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు. బీసీలను పావులుగా వాడుకునే వైసీపీకు, సముచిత న్యాయం కల్పించిన టీడీపీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.…
ఆ ఇద్దరు నేతలు జిల్లాలో టీడీపీకి కీలకం. కానీ.. ఒకరంటే ఒకరికి గిట్టదు. పార్టీ కష్టకాలంలో ఉన్న టైమ్‌లోనూ ఆధిపత్య పోరాటమే. బడానేతలు తెరవెనక చేస్తున్న కుట్రలతో 3 నియోజకవర్గాల్లో గ్రూపుల గోడవలు తారాస్థాయికి చేరాయి. ఆ నాయకలు ఎవరో.. ఆ నియోజకవర్గాలేంటో..ఈ స్టోరీలో చూద్దాం. మూడు నియోజకవర్గాల్లో కోల్డ్‌వార్‌శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటలు గత ఎన్నికల్లో మంచులా కరిగిపోయాయి. పది నియోజకవర్గాల్లో సైకిల్‌కు దక్కింది రెండే. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార వైసీపీదే హవా. అయినప్పటికీ…
పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేందుకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం ఈ మరణాలు సాధరణ మరణాలే అని, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ప్రకటించింది. అయితే కల్తీ సారా తాగే వారు మృత్యువాత పడ్డారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు నేతృత్వంలో జంగారెడ్డి గూడెం…
వైసీపీ వేయి రోజుల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబు. వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. సీఎం జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ టీడీపీ పుస్తకం విడుదలయింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసింది. అశుభంతో…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోంది గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గాల్లోకి విసిరేశారు టీడీపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్…