ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారా.?తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో ఎన్నికల్లో గెలవడానికి కన్నూమిన్నూ కానకుండా హామీలిచ్చారు.
ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి. జగన్ చేసిన మోసాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు.
ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా?-రామకృష్ణ
విజయవాడను పోలీసుల వలయంలో ఉంచటం తగునా? విజయవాడలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తోసహా పలు ప్రాంతాల్లో వందలాది మంది పోలీసుల మోహరింప చేశారు. ముళ్ల కంచెలు వేశారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ మడమ తిప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా? అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
Read Also:Acharya : కాజల్ ఫ్యాన్స్ కు షాక్… అసలు విషయం చెప్పేసిన స్టార్ డైరెక్టర్