తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్న అచ్చెన్న… ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.. ఇక, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానన్న అచ్చెన్నాయుడు… రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా, టీడీఎల్పీ ఉప నేతగా వ్యవహరిస్తున్నందున కోరిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మరి, అచ్చెన్నాయుడు లేఖపై డీజీపీ ఎలా స్పందిస్తారు.. అచ్చెన్నకు అదనపు భద్రత కల్పిస్తారా? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: Cyclone Asani: ‘అసని’ ఎఫెక్ట్.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..