పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేందుకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం ఈ మరణాలు సాధరణ మరణాలే అని, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ప్రకటించింది. అయితే కల్తీ సారా తాగే వారు మృత్యువాత పడ్డారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు నేతృత్వంలో జంగారెడ్డి గూడెం తెలుగుదేశం ఎమ్మెల్యేలు బయలు దేరారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో జంగారెడ్డిగూడెంకు బయలు దేరారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మృతుల కుంటుంబాలను టీడీపీ ఎమ్మెల్యేలు పరామర్శించనున్నారు. అంతేకాకుండా పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నారు. మొత్తం 27కుటుంబాలకు రూ. 27 లక్షలు పరిహారం ఇవ్వనున్నారు.