ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అధికార పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నాం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు అన్నారు. ఏ అంశంపైనైనా చర్చకు మేం సిద్ధం….వేదిక ఎక్కడో అధికార పార్టీ నేతలు చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రజల స్రవంతి, వంశధార-బహుద నదుల అనుసంధానం చంద్రబాబు ఆకాంక్ష. కానీ రేండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఎస్… బాస్ అనే వ్యక్తులు ఉత్తరాంధ్ర మంత్రులుగా వున్నారు.. అంతేగాని ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లే సత్తా ఉన్న ఒక్కరు మంత్రులుగా లేరు. వంశధార ప్రాజెక్టు వల్ల పార్టీకి…
శ్రీకాకుళం : ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లో 155 స్థానాలతో టీడీపీ అధికారంలోకి రావడం తధ్యమని స్పష్టం చేశారు. ఇవాళ పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా టీడీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈరోజు ర్యాలీ జరుగుతుందని నేనసలు అనుకోలేదని… పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు బయటికి రావాలో అచ్చెన్నాయుడుకి తెలుసని… జగన్ ను ఎప్పుడు గద్దె దించాలో కూడా…
పవర్ పోవడంతో.. ఢీలాపడ్డ ఆయనకు గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. రానురానూ వాటికి అలవాటు పడిపోయారో ఏమో.. ఎవరైనా తమ బాధలు చెబితే.. వెయిట్ ప్లీజ్ అంటున్నారట. మన టైమ్ వచ్చే వరకూ ఓపిక పట్టాలని ప్రవచనాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా హితోక్తులు? అచ్చెన్న మాటల్లో దూకుడు లేదా? ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి తాజా వైఖరి తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలోకి జారినా మొన్నటి వరకు దూకుడుగా…
ఆ నాయకుడిపై సిక్కోలు టీడీపీ తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారట. ఏదో జరుగుతుందని ఆశిస్తే.. ఇంకేదో అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ తమ్ముళ్లకు ఎవరిపై కోపం వచ్చింది? వారి బాధేంటి? ఎవరి వైఖరిని చర్చకు పెడుతున్నారు? అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడైనా సిక్కోలు టీడీపీలో నైరాశ్యం ఒకనాడు టీడీపీకి కంచుకోటైన సిక్కోలులో ప్రస్తుతం సైకిల్ పార్టీ క్యాడర్‌కు దారీతెన్నూ లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు ఓ వెలుగు వెలిగిన వారు.. కష్టకాలంలో కనిపించడం…
సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసారు అచ్చెన్నాయుడు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబి, ఏసీబీ, పీసీబీ, టాగ్ లైన్ సిఐడి అని చురకలు అంటించారు. సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మంచి పనితో మొదలు పెడతారు.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విధ్వంసంతో మొదలు పెడుతుందన్నారు. జేసీబీ-ప్రజా వేదికను కూల్చడంతో రాష్ట్రంలో జగన్ విధ్వంసం ప్రారంభించారని.. ఏసీబీ-జగన్ పరిపాలన…
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని…
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ట్వీట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పని చేసుకుపోతున్నారు. జగన్ వెనుక కొన్ని కుక్కలు మొరుగుతాయ్ అవన్నీ పట్టించుకోనవసరం లేదు. మేం ట్వీట్ లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదు. సభాపతిగా నాకు కొన్ని పరిమితులున్నాయ్. కానీ అచ్చెన్నాయుడి ట్వీట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతోంది అని అన్నారు. 17తర్వాత టీడీపీ లేదు డాష్ లేదు అని ఆయన అన్నదే కదా……