Minister Atchannaidu: పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని లేఖలో పేర్కొన్నారు. రైతులు ప్రస్తుతం కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడి పేషీలో అరాచకాలు జరిగిపోతున్నాయా? వాటన్నిటికీ కారణం ఒకే ఒక్కడా? విషయం తెలిసినా, ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా... మంత్రి ఆయన్ని ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారు? ఇద్దరి మధ్య అంత అనుబంధం ఏంటి? పైగా అచ్చెన్నాయుడు ఈ విడత మంత్రి అయ్యాక సదరు వ్యక్తిని ఏరికోరి పేషీలోకి తెచ్చుకున్నారన్నది నిజమేనా?
వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.
Atchannaidu: 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు.
Minister Atchannaidu: కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.