Tdp Praja Chargesheet: 1000రోజుల జగన్ పాలనలో అన్నీ ఘోరాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ వేయి రోజుల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబు. వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. సీఎం జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ టీడీపీ పుస్తకం విడుదలయింది. విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసింది.
అశుభంతో పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ ఒక్కరే. సమస్యల పరిష్కారానికి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. ప్రాంతీయ విద్వేషాల కోసమే 3రాజధానులు నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానుల నిర్ణయంతో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రూ. 2 లక్షల కోట్ల సంపద అమరావతిని చంపేశారు.
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగపడ్డారు. మూడేళ్ల జగన్ పాలనలో అన్నీ నేరాలు ఘోరాలే. సొంత బాబాయి వివేకాతో పాటు కోడెల, మాస్క్ అడిగిన వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతోమంది చావులకు ఈ ప్రభుత్వమే కారణం అన్నారు అచ్చెన్నాయుడు. కక్షసాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప. రాష్ట్రంలో సీఎం జగన్ చేసిన దాడులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోయాయి. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశారు. దాడులు, కిడ్నాపులు బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్ని అపహాస్యం చేశారని సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు చినరాజప్ప.
వెయ్యి రోజులుగా వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వ నిర్ణయాలు.. రైతుల్ని మానసిక వేదనకు గురిచేస్తూనే ఉన్నాయి. రైతులకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకుండా నెలలు తరబడి పెండింగులో పెడుతున్నారు. జగన్ పాలనలో పోలవరం ప్రశ్నార్డకమైంది.వెయ్యి రోజుల్లో ఒక్క బోర్ వెల్ కూడా రైతులకు ఉచితంగా వెయ్యలేదు. నిరాటంకంగా 9గంటల విద్యుత్ ఇవ్వకపోగా, లాలూచీ కోసమే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను దళారీ కేంద్రాలుగా మార్చారని విమర్శించారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!