ఏపీ కేబినెట్ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు కేబినెట్ పై మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి సజ్జల, వైవీ, విజయసాయి రెడ్డిలకు పంచాక బీసీలకు ఎన్ని మంత్రి పదవులిస్తే ఏం లాభం..? అన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అధికారం తమ చేతుల్లో పెట్టుకుని బీసీ మంత్రులను కీలు బొమ్మల్లా ఆడిస్తున్నారు.
బీసీలను పావులుగా వాడుకునే వైసీపీకు, సముచిత న్యాయం కల్పించిన టీడీపీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. మూడేళ్లల్లో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా..? వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చించేందుకు సిద్ధమా..? రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని వైసీపీకి అర్థమైంది. అందుకే తమ నేతకు ఇప్పుడు కూడా మంత్రి పదవి రాకపోతే ఎట్లా అంటూ రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. వైఎస్ కుటుంబానికి బలహీన వర్గాలంటే కోపం. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే జగనుకు బీసీలంటే కోపం వుందన్నారు.
https://ntvtelugu.com/mp-gvl-narasimharao-slams-cm-jagan-cabinet/
పైసా నిధులు కేటాయించకుండా బీసీ ఫెడరేషన్లను వైఎస్ పెట్టారు. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల్ని సైతం లాక్కుని జగన్ మోసగించారు. బలహీనవర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం. జిల్లాలు జిల్లాలు తిరిగి బీసీలను ఏకం చేస్తాం. చంద్రబాబుతో దెబ్బలాడైనా సరే బీసీల హక్కుల కోసం కృషి చేస్తాం అన్నారు అచ్చెన్నాయుడు.