ఏపీలో ఓటీఎస్‌ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని…
ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనకబడిందని, ఇతర…
ఒక్క రూపాయి కట్టొద్దని చెప్పడానికి నువ్వు ఎవరు ? అని అచ్చెన్నాయుడు కు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బెజవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్ధాపనలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తుంటాయి..వారు చేయరు చేసే వాళ్లు చేయనివ్వరని మండిపడ్డారు. జగనన్న శాశ్వత గృహ పథకాన్ని విమర్శించడం సిగ్గుచేటు అని మండి పడ్డారు. ఇళ్ల…
జగన్ తన పుట్టిన రోజున పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమం ప్రారంభించారని దుయ్యబట్టారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ నోటి వెంట అమ్మడం అనే పేరు తప్ప ఇంకో మాట రావడం లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు ఇచ్చిన ఇళ్లపై జగన్ ఇప్పుడు భారం మోపుతున్నారు. సీఎం జగన్ తన పుట్టిన రోజు OTS అనే ఒక దుర్మార్గమైన కార్యక్రమం మొదలు పెట్టారు. అసలు OTSపై సీఎం జగనుకేం హక్కు…
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అక్కడ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఒక్క అవకాశం అంటూ దరిద్రాన్ని తెచ్చుకున్నారు. పాఠశాలల్లో నాడు నేడు పేరుతో వేల కోట్ల అవినీతి జరుగుతుంది. పాఠశాలల్లో రూ. 10 పనికి రూ. 100 కొట్టేశారు. పేదలకు పట్టాల పేరుతో ఓటిఎస్ అంటూ రూ. 5 వేల కోట్లు వసూలు చేసేందుకు సిద్దమయ్యారు. విదేశీ విద్యాదీవన పథకాన్ని మధ్యలో నిలిపి వేస్తారా.. విదేశాల్లో…
అమరావతి : ఏపీ జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ వరదల పై శద్ర పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగనుకి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటంలో లేదని… జగన్.. ఇకనైనా బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకుతక్షణమే ఆర్దిక సాయం అందించాలని…
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘మమ్మల్ని రాజీనామా చేసి రమ్మంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏం పీకారు. దమ్ముంటే టీడీపీలో మిగిలిన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవండి చూద్దాం. 19 మందిలో మీకు సింగిల్ డిజిట్ వస్తే మేం రాజీనామా చేస్తాం’…
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన మహిళలను…
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది… అయితే, ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌కు చలి జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించిన ఆయన.. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదు.. భావితరాల భవిష్యత్ యాత్రగా అభివర్ణించారు.. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ…
టీడీపీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్ హరిచందన్ను గురువారం సాయంత్రం టీడీపీ నేతల బృందం కలిసింది. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దాడులపై వీడియో ఫుటేజీని కూడా గవర్నర్ కు అందజేశారు. గవర్నర్ను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఉన్నారు.…