ఏపీ సీఐడీ అడినషల్ డీజీపికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ ఏపీ చీఫ్ అచెన్నాయుడు సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు ఈ ఫోర్జరీ జరిగిందని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ సంతకాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై అనేక ఫిర్యాదులిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. వైసీపీ మద్దతుదారులు జూన్…
సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత కొన్ని సందర్భాల్లో అసలు వార్త ఏది? వైరల్ ఏది..? ఫేక్ ఏది తెలియని పరిస్థితి ఏర్పడింది.. కొందరు అదే నిజమని కూడా నమ్మేస్తున్నారు.. తాజాగా, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటన హల్‌చల్ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థని.. సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తామని అచ్చెన్న పేరుతో నకిలీ ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ ప్రకటనను…
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీనవర్గాలపై దాడేనని ఆరోపించారు. ఈ అంశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసలు జగన్‌కు అయ్యన్న కుటుంబం చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి…
పార్టీ అధికారంలో ఉండగా ఆమెకు నెంబర్‌వన్ ఎమ్మెల్యేగా పేరు. జిల్లా పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పట్లో పొగిడి పనులు చేయించుకున్న నాయకులే ఇప్పుడు రివర్స్ అవుతున్నారట. గట్టిగానే పొగ పెడుతున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? సొంత పార్టీలో ఎందుకు ఇబ్బందిగా మారింది? గుండ శిబిరాన్ని కలవరపెడుతున్న పరిణామాలు శ్రీకాకుళం టీడీపీలో మొదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ గత సంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని…
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని సవాల్ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె్న్నాయుడికి వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ లేదు బొక్కా లేదన్న మీ మాటల దెబ్బకు ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయి అచ్చన్న.. తోలు మందం వల్ల మీకు తెలియడం లేదు.. రెఫరెండం కోరాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుగా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పార్టీ…
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జగన్‌కు అంత నమ్మకమేంటని ప్రశ్నించారు. నిజంగా అంత నమ్మకం ఉంటే జగన్ ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. తక్షణమే గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసలు…