Bl Santhosh: తెలంగాణలో హంగ్ వస్తుంది.. ఎట్టి పరిస్థితుల్లో అధికారం మనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు అని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి అని బీఎల్ సంతోష్ తెలిపారు. నేతలు వివేకంతో ఆలోచించాలంటూ ఆయన హితవు పలికారు. కాగా, నిన్న (గురువారం) జరిగిన బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో కూడా బీఎల్ సంతోష్ హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదు.. 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ ఇప్పుడు కూడా నడుస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు.
Read Also: Prabhas: ప్రభాస్ భార్య పిల్లలను చూసారా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోస్
Also Read
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉన్న నేపథ్యంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో ఒకవేళ బీఎల్ సంతోష్ చెప్పినట్లు హంగ్ ఏర్పడితే.. బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాయకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, సీట్ల కేటాయింపు ఢిల్లీలో ఉండదు.. తెలంగాణలోనే జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఏర్పడి బీజేపీ అధికారంలోకి వస్తుందని కాషాయ శ్రేణులకు బీఎల్ సంతోష్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్‌లు కలుస్తాయా అనే అనుమానం వస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!