MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ చర్చను బట్టి మరో రెండు ఆప్షన్లు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఆమె నిజామాబాద్‌లోని బోధన్ నుంచి లేదా జగిత్యాల జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
సిట్టింగులకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చాలాసార్లు హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా సిట్టింగ్‌లలో ధైర్యాన్ని నింపింది. అందుకే ప్రజల్లోకి వెళ్లి గ్రాఫ్ పెంచుకోవాలని కేసీఆర్ సూచించారు. దీంతో సిట్టింగులు మళ్లీ టికెట్ తమకే దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు. కానీ, కొందరికి అనుమానాలు ఉన్నాయి. టికెట్ ఇవ్వకుంటే ఏం చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే నిరుత్సాహానికి గురైన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్ చేయడం, ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయడం, లేదంటే తమ భవిష్యత్తును కేసీఆర్ చేతిలో పెట్టి పార్టీలో కొనసాగడం వంటి ఆప్షన్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకు బదులు ఎమ్మెల్సీలకు టిక్కెట్లు ఇస్తే కనీసం 15 మంది సిట్టింగులకు టిక్కెట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్సీలకు బీఆర్‌ఎస్ టిక్కెట్ ఇస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Read also: Health Benefits: కిస్ మిస్ తినకపోతే.. ఈ లాభాలు మిస్ అయినట్టే..!
మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్సీ కవితకు కూడా ఎమ్మెల్యే టికెట్‌పై చర్చ జరుగుతోంది. బిగాల గణేష్ గుప్తా ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంటే.. మరో వైపు వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కల్వకుంట్ల కవితపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఎంపీకి సవాల్‌గా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలవాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా బీఆర్‌ఎస్ నేతలు కూడా దీనికి సంబంధించి కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఆర్మూర్ సెగ్మెంట్ లో అంతకుముందు జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి కవితక్కకు ఓటు వేయాలని కోరడం చర్చనీయాంశమైంది.
Health Benefits: కిస్ మిస్ తినకపోతే.. ఈ లాభాలు మిస్ అయినట్టే..!