దేశంలో మరో టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్ లో పీఎఫ్ఐ ఉగ్రకుట్ర బయటపడిన నేపథ్యంలో అస్సాంలో మరో ఉగ్రవాద కుట్ర వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉన్నాడు.
అస్సాంలో వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 35 మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు.
వరదలు, భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ ( జేఈ ) వ్యాధి కలవరపెడుతోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపుకు కారణం అవుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధితులు బాధపడుతుంటారు. సరైన సమయంలో వైద్యం అందకపోతే వ్యాధి చికిత్సకు లొంగే పరిస్థితి ఉండదు. తాజాగా ఈ వ్యాధి అస్సాం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతోంది. ఇప్పటి వరకు జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కారణంగా 15…
ఈశాన్య భారతం వరదల, భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియాలు విరగిపడ్డాయి. ముఖ్యంగా అస్సాంలోని 28 జిల్లాల్లో 20 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యారు. 150 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 40కి పైగా సైనికులు, ప్రజలు చనిపోయారు. ఇక అన్ని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికించాయి.…
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడిగా వేషం ధరించి నుక్కుడ్ నాటకంలో నటించిన వ్యక్తిపై నాగోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంపై సీఎం హిమంతబిశ్వ శర్మ కూడా స్పందించారు. దుస్తులు ధరించడం నేరం కాదని.. అలాంటి…
అస్సాం వరదలు ఆ రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల వల్ల 173 మరణించారు. ఒక్క శుక్రవారమే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కాచార్ జిల్లాలో ఆరుగురు, నాగోన్ జిల్లాలో ముగ్గురు, బార్ పేటలో ఇద్దరు, కరీంగంజ్, కోక్రాజార్, లఖింపూర్ లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 30 జిల్లాల్లో 29.70 లక్షల మంది వరద…
కుటుంబకలహాలతో భార్య భర్త ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. హాస్యాస్పదంగా సాగే మాటలు గొడవ చేసుకుని ఒకరిపై మరొకరు చంపుకునేందుకు వెనుకాడటంలేదు. మరి వీరి కుటుంబంలో ఏంజరిగిందో ఏమో కానీ తన భార్యను అతి దారుణంగా చంపి.. తనుకూడా మృత్యుఒడికి చేరుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహా నందు బి. స్పాస్, భార్య పంపా సర్కార్ ఇరవై రోజుల క్రితం…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అగ్గిరాచుకుంటోంది. ఒకరినొకరు పోటాపోటీగా సమావేశాలకు ఏర్పటు చేస్తుకుంటున్నారు. శనివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి ఇటు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే మద్దతుగా నిలిచిన తమ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పోటాపోటీ సమావేశాలతో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే వర్చువల్ మీట్ లో ద్వారా సీఎం మాట్లాడనున్న విషయం తెలిసిందే. అయితే…
Shiv Sena leader Eknath Shinde on Wednesday claimed that 40 party MLAs have reached Assam and said that they will carry Balasaheb Thackeray's Hindutva.