అసోంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు స్కూటర్ కొనుగోలు చేసేందుకు తాను తాచుకున్న డబ్బంతా బైక్ షోరూంకు బస్తాలో తీసుకెళ్లాడు. అయితే ఆ నగదు అంతా చిల్లర నాణేలు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నెలలు తరబడి చిల్లర నాణేలను పొదుపు చేశాడు. ఇలా ఎనిమిది నెలల పాటు పోగుచేసిన నాణేలను ఒక బస్తాలో వేసి…
ఈరోజుల్లో దేశంలో పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేస్తుండటంతో పాటు మగవారితో సమానంగా సంపాదిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో మహిళలు తమకు నచ్చిన వ్యక్తులను ఎంచుకొని వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో దేశంలో పెళ్లికాకుండా మిగిలిపోతున్న పురుషుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ఒక్కపెళ్లి కోసమే చాలా మంది ఎదురుచూస్తుంటే, ఒడిశాకు చెందిన బిధు ప్రకాశ్ స్వైన్ అనే వ్యక్తి 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందరూ కలిసి ఉంటారా అంటే లేదు. ఒకరికి తెలియకుండా మరోకరిని వివాహం…
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వ్యవహారంపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. అస్సాం ముఖ్యమంత్రి డీఎన్‌ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు ఆయన డీఎన్‌ఏ చైనాదా? అస్సాందా? అనేది తేలాలన్నారు. ఇక, మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్‌రెడ్డి.. భారత్ మాతాకు పుట్టినోల్లా……
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.. రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని మేం ఆడిగామా? అని అస్సాం సీఎం అంటే.. కాంగ్రెస్ పార్టీగా నేను అస్సాం సీఎంకి ఎంత మంది తండ్రులని అడగాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ తండ్రి ఎవరని మూర్ఖత్వంగామాట్లాడడు.. అసలు రాహుల్…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. క్రమంగా సీఎంను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.. ఈ అంశంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భట్టి……
ఉదయం లేచినప్పటి నుంచి తిరిగి నిద్రపోయే వరకు మనజీవితంలో ఒక్కక్కటి ఒక్కోవిధంగా భాగమై ఉంటుంది. కొంతమంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది లేచిన వెంటనే టీ తాగుతుంటారు. టీ అంటే మనకు గుర్తుకు వచ్చేది అస్సాం. అస్సాంలో టీ తోటలు అధికం. అక్కడ నాణ్యమైన తేయాకును పండిస్తుంటారు. అస్సాంలో దొరికిన్ని వెరైటీలు మరెక్కడా దొరకవు. కిలో తేయాకు రూ. 100 నుంచి వేల రూపాయల వరకు ఉంటుంది.…
గడిచిన 580 ఏళ్లలో ఆకాశంలో ఎన్నడూ చోటుచేసుకోని అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈనెల 19న సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఆకాశంలో దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానిటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ దేబిప్రసాద్ దురై శనివారం వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం ఈనెల 19న మధ్యాహ్నం 12:48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. మొత్తం 3 గంటల 28 నిమిషాల…
రోడ్డు ప్రమాదం 10 మంది భక్తులను పొట్టనబెట్టుకున్న ఘటన అసోంలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని కరీంగంజ్ జిల్లా బైతఖల్ వద్ద భక్తులతో వెళ్తున్న ఆటోను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది మృతిచెందారు. ప్రమాద ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఈ…
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు. ఎందుకంటే తెలియని వారికంటే ఎక్కువ తెలిసినవారి చేతిలోనే చాలామంది మోసపోతున్నారు. కొద్దీ రోజుల్లో పెళ్లి.. ఎంతో అందమైన జీవితం ఊహించుకున్న ఆ అమ్మాయి జీవితాన్ని వరుసకు అన్న అయ్యే యువకుడు రోడ్డుపాలు చేశాడు. అన్ననే కదా అని కారు ఎక్కిన పాపానికి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతిని రేప్ చేయడమే కాకుండా, ఆమె నగ్న ఫోటోలను…
జైళ్లలో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన అసోంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది… రాష్ట్రంలోని సెంట్రల్ జైలు, నాగావ్‌లోని ప్రత్యేక జైలులో గత నెలలో ఈ కేసులు వెలుగు చూశాయి… రెండు జైళ్లలో కలిపి ఏకంగా 85 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఈ ఘటనపై నాగావ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ పటోర్ వివరణ ఇస్తూ.. ఖైదీల్లో ఎక్కువ మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని…