Assam: నెలలు నిండకముందే గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపలపెట్టి కుట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: కొందరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. మరెంతో మంది ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అలా ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఏకంగా ఓ గర్భిణికి నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తిసి ఆ శిశువు పూర్తిగా వృద్ధి చెందలేని తెలిసి తిరిగి కడుపులో పెట్టి కుట్టేసిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఏదో అల్మారాలో వస్తువు తీసి అదికాదు అన్నట్లుగా తిరిగి అల్మారాలో పెట్టేసినట్లుగా గర్భిణి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి ఆ బిడ్డ ఇంకా పూర్తిగా వృద్ధి చెందలేదని కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు ఓ వైద్యుడు. ఆ డాక్టర్ చేసిన ఘనకార్యం తెలిసి సదరు గర్భిణి బంధువులు ఆందోళన చేపట్టారు.
Boat Accident: పడవ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
అస్సాం కరీంగంజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఓ గర్భిణీ వచ్చింది. నవీ నమశూద్ర అనే ఏడు నెలల గర్భిణి నొప్పులతో డాక్టర్ వద్దకు వెళ్లి పరిస్థితిని చెప్పింది. ఆమెను పరీక్షించిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ కుమార్ బిస్వాస్ ఆమె ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకోలేదు. అంతేకాదు కనీసం ఆమెకు ఎన్ని నెలల గర్భం అని కూడా తెలుసుకోకుండానే డెలీవరీ చేయాలి అంటూ ఏకంగా సర్జరీ చేసేశాడు. తీరా బిడ్డను బయటకు తీశాక..అయ్యో పిండం ఇంకా పూర్తిగా శిశువుగా వృద్ధి చెందలేదు అని తెలుసుకుని తిరిగి బిడ్డను కడుపులో పెట్టి కుట్లు వేసేశాడు. అదేదో వస్తువును డ్రాలో దాచినట్లుగా పెట్టి కుట్లేసి ఇంటికి పంపించివేశాడు. పది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. తిరిగి ఆస్పత్రికి రావడంతో ఆమెకు సర్జరీ జరిగినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలంటే లెక్కలేదా అంటూ విరుచుకుపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?