స్సాంలోని చరైడియో జిల్లాలోని రెండు పాఠశాలలకు చెందిన మొత్తం 50 మంది విద్యార్థులు శనివారం ఆరోగ్య శాఖ కార్యకర్తలు అందించిన ఐరన్-ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలను సేవించిన కారణంగా అస్వస్థతకు గురయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి.
మేఘాలయ ప్రభుత్వం శుక్రవారం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను మరో 48 గంటలపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల ప్రకారం.. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని సస్పెన్షన్‌ను పొడిగించారు.
India shedding colonial mindset, says PM Modi: ఢిల్లీలో అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతదేశ చరిత్ర వక్రీకరణపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ధాలుగా మనల్ని దోచుకుని, ఓడిపోయే వ్యక్తులమని చెప్పడానికి ప్రయత్నించారని.. భారతదేశ చరిత్ర కేవలం వలసవాదానికి సంబంధించింది కాదని.. ఇది యోధుల చరిత్ర అని ఆయన అన్నారు. భారతదేశ చరిత్ర అణిచివేతదారులపై…
"Who Stops Us From Correcting 'Distortions' In History Now?" Amit Shah: భారత చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. వారి చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నేను చరిత్ర విద్యార్థిని అని.. చరిత్రను సరిగ్గా రాయలేదని, వక్రీకరించబడిందని నేను చాలా సార్లు విన్నానని.. బహుశా అదే నిజం కావచ్చు అని.. దీన్ని మనం సరిదిద్దాలని కోరారు. అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్…
Peace talks between Assam-Meghalaya: అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో భారీగా హింస జరగడంతో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. కలప స్మగ్లింగ్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు హింసకు దారి తీసింది. ప్రస్తుతం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉన్న మేఘాలయ, అస్సాం సరిహద్దు గ్రామం అయిన ఉమ్లాపర్ వద్ద అస్సాం పోలీసులు నిఘాపెంచారు. ఇదిలా ఉంటే అస్సాం పెట్రోలియం కార్మికులు మేఘాలయకు ఇంధన రవాణా నిలిపివేస్తునట్లు ప్రకటించారు. అస్సాం…
అసోం-నాగాలాండ్ సరిహద్దులో అసోంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ సమీపంలోని లాహోరిజాన్ ప్రాంతంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి.
Assam and Meghalaya Border Firing : అసోం-మేఘాలయ రాష్ట్రాల మధ్య మళ్లీ హింస చెలరేగింది. అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోర్డర్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మృతిచెందారు.
అమ్చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చిన అడవి ఏనుగు అస్సాం రాజధాని గౌహతిలోని నారంగి ఆర్మీ కాంట్‌లోని పిల్లల పార్కులో ఉన్న ఆట వస్తువులతో సరదాగా ఆడుతూ కనిపించింది.
పానీపూరీ అంటే మన చాలా మందికే కాదు.. ఈ గజరాజుకు కూడా మహా మక్కువేనేమో.. పానీపూరి బండివాడు చక్కగా సర్వ్ చేస్తుంటే.. చకాచకా నోట్లో వేసుకుని ఎంజాయ్ చేస్తోంది. అస్సాం తేజ్‌పూర్‌లో ఈ దృశ్యాలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.