IndiGo plane skids off runway: ఇటీవల కాలంలో ఇండియాలో వరసగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. పలు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటికే ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది.
ఇదిలా ఉంటే గురువారం ఇండిగో విమానం 6ఈ-757ని ప్రమాదానికి గురైంది. అస్సాంలోని జోర్హాట్ నుంచి కోల్ కతా వెళ్లడానికి సిద్ధమైన ఇండిగో విమానం.. టేకాఫ్ కోసం రన్ వే పైకి వచ్చింది. ఈ సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కన ఉన్న అవుట్ ఫీల్డ్ లోని బురదలోకి చక్రాలు కూరుకుపోయాయి. విమానాన్ని టేకాఫ్ కోసం టాక్సీ వే నుంచి రన్ వేకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో ఉన్న 98 ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.
Read Also: Musi Flood : 1908లో హైదరాబాద్ వరదలు ఓ చీకటి అధ్యాయం
జూలై 5 నుంచి జూలై 21 మధ్య దాదాపుగా 9 విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. ఎయిరిండియా విమానం దుబాయ్ నుంచి కొచ్చిన్ వస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైకి మళ్లించారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య కారణంగా పాకిస్తాన్ లోని కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇదే విధంగా ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయంలో దించారు. ఇక దేశీయంగా గోఫస్ట్ సంస్థకు చెందిన విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి.