ఈశాన్య భారతం వరదల, భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియాలు విరగిపడ్డాయి. ముఖ్యంగా అస్సాంలోని 28 జిల్లాల్లో 20 లక్షలకు పైగా ప్రజలు వరదలకు ప్రభావితం అయ్యారు. 150 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 40కి పైగా సైనికులు, ప్రజలు చనిపోయారు. ఇక అన్ని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికించాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈశాన్య రాష్ట్రాలని అధిక ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నారు. ఇటీవల కాలంలో భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు వరదలు, వర్షాలతో ఇబ్బంది పడిన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు భారీగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్సాం గౌహతిలో గురువారం 38.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది సాధారణం కన్నా 6.2 డిగ్రీల అధికం. గత 30 ఏళ్లలో నగరంలో నమోదైన రెండవ అత్యధికి ఉష్ణోగ్రత ఇదే గౌహతిలొో జూలై నెలలో ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలు. జూలై 18, 2018లో నమోదు అయింది.
Read Also: Sai Dharam Tej: తమ్ముడి హీరోయిన్‌తో అన్నయ్య సరసాలు?
అస్సాంతో పాటు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో నగరాల్లో అధిక తేమతో కూడిన ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ అస్సాంలోని సిల్చార్ లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. జూలై నెలలో ఈ నగరంలో ఇదే రెండవ అత్యధిక ఉష్ణోగ్రత. త్రిపుర రాజధాని అగర్తాలలో గురువారం 37.1 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. అగర్తలాలో చివరిసారిగా 1992లో జూలై నెలలో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో గురువారం 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.