PM Modi: గౌహతి విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ను శనివారం ప్రధాని నరంద్రమోడీ ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంత భద్రత, గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారుల్ని రక్షించిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చొరబాటుదారులను ప్రజాస్వామ్య ప్రక్రియ నుండి దూరంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. అయితే, దేశద్రోహులు వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చొరబాట్లను ఆపడానికి కేంద్రం కఠినమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని అన్నారు.
Read Also: Bhartha Mahashayulaku Vignapthi: పైసా తీసుకొని రవితేజ.. కానీ ఒక కండిషన్!
అస్సాం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎప్పుడూ కాంగ్రెస్ ఎజెండాలో భాగం కాదని ప్రధాని అన్నారు. చొరబాటుదారులు అడవులు, భూమిని ఆక్రమించుకోవడానికి అనుమతించిందని, ఇది భద్రత, గుర్తింపుకు ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ దశాబ్ధాలుగా చేసిన తప్పులను బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దుతోందని ప్రధాని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అస్సాం నిరంతర అభివృద్ధికి సాయపడుతోందని అన్నారు. అస్సాం, ఈశాన్య భారత అభివృద్ధికి ద్వారంగా పనిచేస్తుందని అన్నారు.