Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
Sharmistha Panoli: ‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివాదాస్పద పోస్ట్ పెట్టిన తర్వాత, ఇన్‌ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ట పనోలిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారనే ఆరోపణలపై ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పనోలికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు దంచికొట్టాయి. దీంతో 132 ఏళ్ల రికార్డ్ బద్ధలైంది. వాగులు, వంకలు అన్ని ఏకమయ్యాయి.
Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న అనుమానిత బృందం ప్రయత్నాలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. అస్సాంలోని దక్షిణ సల్మారా మంకాచర్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కి చెందిన బృందం చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఈ రోజు తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద అనుమానిత కదలికలను గుర్తించడంతో సరిహద్దు దళాల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి.
Himanta Biswa Sarma: అస్సాంలో బాల్య వివాహాలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల 2021-22, 2023-24 మధ్య కాలంలో రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 20 జిల్లాల్లో ఇటువంటి కేసులు 81 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి శపథం చేశారు.
దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Himanta Biswa Sarma: భారతదేశం వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన “చికెన్ నెక్ కారిడార్”పై తరచూ బెదిరింపులు చేస్తున్న వారికి కౌంటర్‌గా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్‌పై మండిపడ్డారు. భారత్‌కు ఒక్క చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కు రెండు ఉన్నాయని.. అవి భారతదేశంతో పోలిస్తే చాలా అసురక్షితమని ఆయన అన్నారు. ‘సిలిగురి కారిడార్’ అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్న సన్నని భూభాగం. దీని వెడల్పు సగటున 22 నుండి 35 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ…
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలను మరింత రెట్టింపు చేవారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న హిమంత, ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, ఇది…
BJP: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
Crime: 10 ఏళ్ల బాలుడిని అతడి తల్లి ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. డెడ్ బాడీని సూట్ కేస్‌లో పెట్టి పొదల్లో విసిరినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. గౌహతి పోలీస్ డిప్యూటీ కమిషనర్ (తూర్పు) మృణాల్ డేకా మాట్లాడుతూ.. తన కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి శనివారం మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసిందని చెప్పారు.