భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. ఏ ఒక్కరికైనా భయాందోళనలు సహజం. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం వృత్తికి తగినట్టుగా తమ బాధ్యతలు నెరవేర్చి శెభాష్ అనిపించుకుంటున్నారు. ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వార్డులో శిశువులు ఉన్నారు. హఠాత్తుగా ప్రకంపనలు వచ్చేశాయి. కానీ ఏ మాత్రం జడియకుండా శిశువులకు రక్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణం
ఆదివారం అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో భూకంపం సంభవించింది. అస్సాంలో 5.8 తీవ్రత భూప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో అస్సాంలోని నాగావ్‌లోని ఒక ఆస్పత్రి వార్డులో నవజాత శిశువులు ఉన్నారు. అక్కడే ఇద్దరు నర్సులు సంరక్షిస్తున్నారు. ఇంతలోనే ప్రకంపనలు వచ్చాయి. వార్డులో వస్తువులు అన్ని ఊగిపోతున్నాయి. కానీ ఏ మాత్రం భయపడకుండా నర్సులిద్దరూ శిశువుల దగ్గరకు వెళ్లి కదలకుండా పట్టుకున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నిజ జీవిత హీరోలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వార్డులో ప్రకంపనలతో వణికిపోతున్నా.. ఏ మాత్రం భయపకుండా పిల్లల్ని కాపాడారంటూ ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్
VIDEO | As an earthquake of 5.8 magnitude shook parts of the northeast region and West Bengal on Sunday, nurses from a hospital in Assam's Nagaon acted heroically, ensuring the safety of newborns as tremors hit the region.
(Source: Third Party)
(Full video available on PTI… pic.twitter.com/MOFUmU93QY
— Press Trust of India (@PTI_News) September 15, 2025