Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్ బ్యాటర్!
- శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం
- దునిత్ తండ్రి సురంగా గుండెపోటుతో మృతి
- షాకైన అఫ్గాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్‌మెంట్‌కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తండ్రి మరణవార్త తెలియకముందే.. దునిత్ వెల్లలాగేకు శ్రీలంక, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. అఫ్గాన్ బ్యాటర్ మహమ్మద్ నబీ అతడి బౌలింగ్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ దునిత్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది.. అఫ్గాన్‌కు ఊహించని స్కోరు అందించాడు. 20 ఓవర్లలో అఫ్గాన్ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అయితే లక్ష్యాన్ని శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ మెండిస్ (74) హాఫ్ సెంచరీ చేయగా.. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ (26 నాటౌట్) రాణించారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Also Read: Kokapet Murder: కూరగాయాల కత్తితో రప్పా రప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య!
మ్యాచ్ ముగిసిన అనంతరం హోటల్ రూమ్‌కు వెళ్లే క్రమంలో ఓ రిపోర్టర్ దునిత్ వెల్లలాగే తండ్రి చనిపోయాడనే విషయాన్ని మహమ్మద్ నబీకి చెప్పాడు. విషయం తెలిసి నబీ షాక్‌కు గురయ్యాడు. ఆపై తన సంతాపాన్ని తెలియజేశాడు. హార్ట్ ఎటాక్‌తో? చనిపోయాడా?.. నిజంగానా? అంటూ నబీ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. దునిత్ శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 31 వన్డేలు, 5 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 46 వికెట్స్ పడగొట్టాడు.
The moment when Mohamed Nabi was informed about the sudden demise of Dunith Wellalage’s father. Mohamed Nabi hit 5 sixes of Dunith Wellalage’s bowling in the last over of Afghanistan’s innings. pic.twitter.com/sjfAUzQvE6
— Nibraz Ramzan (@nibraz88cricket) September 18, 2025
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!