బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు.
బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియర్ కిల్లర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ యత్నించిందని, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని యత్నించిందని.. కానీ ఆప్ నేతలు వారి బుట్టలో పడలేదని ఆయన అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తనపై హనీట్రాప్ జరిగిందని చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, తమ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తోన్న క్రమంలో, హనీట్రాప్ వ్యవహారం దుమారం రేపుతోంది. తనను హనీట్రాప్ చేసేందుకు ఎవరో కుట్ర చేశారంటూ, వాట్సాప్ చాట్ కు…
ఢిల్లీలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచినందుకుగానూ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అన్నారు. అయితే రాజకీయ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం వేటాడుతోందని ఆయన ఆరోపించారు.
సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై దాడులు చేయగా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన జాతీయ మిషన్‌లో చేరాలని కోరుతూ 'మిస్డ్ కాల్' ప్రచారాన్ని ప్రారంభించారు.
సీబీఐ దాడుల విషయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ధ్రువీకరించారు. తన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.