గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
గుజరాత్‌పై మార్పు తుఫాన్ దూసుకుపోతోందని. తమ పార్టీ తదుపరి ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి గతంలో ఆమ్ నేత గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ ఎర్రకోటలోని రాంలీలా మైదానంలో వేడుకగా జరుగనున్న రావణదహన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మెజారిటీ పరీక్ష కోసం రాష్ట్ర అసెంబ్లీని సెప్టెంబర్ 22న ప్రత్యేక సమావేశానికి పిలిచినట్లు ప్రకటించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై చర్యలు తీసుకోవాలని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం గురువారం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.