Delhi: 47 ఫైళ్లను తిరిగి సీఎంవోకు పంపిన లెఫ్టినెంట్ గవర్నర్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బదులుగా అధికారిక సిబ్బంది సంతకం చేసినందున ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయం 47 ఫైళ్లను తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) తిరిగి పంపింది. ఎల్‌జీ సెక్రటేరియట్ వాపస్ చేసిన ఫైళ్లలో విద్యాశాఖ, వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి ఉన్నాయి. అంతకుముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం నుండి ఆమోదం లేదా అభిప్రాయం కోసం పంపిన ప్రతిపాదనలపై “సక్రమంగా సంతకం” చేయాలని కోరుతూ ఆయనకు లేఖ రాశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన 45కుపైగా ఫైళ్లపై ఆయన సంతకం లేదు. వీటిపై సీఎం కార్యాలయం అధికారుల సంతకాలున్నాయి. అలాగే ‘సీఎం చూశారు’, ‘సీఎం చూసి ఆమోదించారు’ అని ఆ ఫైళ్లపై పేర్కొన్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా తన లేఖలో ముఖ్యమంత్రికి తెలిపారు.
JP Nadda and Nithiin : జేపీ నడ్డా, హీరో నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి..
Also Read
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతకం చేయకుండా ఫైళ్లను పంపుతుండటంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన నియమ నిబంధనలను పాటించాలని సీఎం కేజ్రీవాల్‌కు సూచించారు. సమర్ధవంతమైన పాలన కోసం ప్రతి ఫైల్‌పై సంతకం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అమలులో ఉన్న ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. తద్వారా ఫైళ్లు పంపేందుకు అనుకూలంగా ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌కు పంపిన లేఖలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!