Arvind Kejriwal: సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై దాడులు చేయగా.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన జాతీయ మిషన్‌లో చేరాలని కోరుతూ ‘మిస్డ్ కాల్’ ప్రచారాన్ని ప్రారంభించారు. “భారతదేశాన్ని నంబర్ వన్ చేయడానికి తమ జాతీయ మిషన్‌లో చేరేందుకు.. దయచేసి 9510001000కు మిస్డ్ కాల్ ఇవ్వండి, భారతదేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకువెళదాం” అని ఢిల్లీ ముఖ్యమంత్రి వీడియో ప్రసంగంలో చెప్పారు. ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అగ్రనేతగా ఉన్న మనీశ్ సిసోడియాపై సీబీఐ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత కేజ్రీవాల్ మాట్లాడారు.
“సీబీఐ దాడిపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి పనిని వారు చేయనివ్వండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పై నుండి వారికి ఆదేశాలు ఉన్నాయి” అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వారి మంచి పని కారణంగా కేంద్రం తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు.
Arvind Kejriwal: సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం
ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన “మేక్ ఇండియా నంబర్ 1” ప్రచారాన్ని ప్రారంభించారు. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఇప్పటి వరకు అధికారంలో ఉన్నవారిని వదిలివేయలేమని చెప్పారు. సుపరిపాలన కోసం ఐదు పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించిన ఆయన.. ఆ ఆశయానికి మద్దతు కూడగట్టేందుకు దేశమంతా పర్యటిస్తానని చెప్పారు.