ఉచిత హామీలు, పథకాలపై బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కార్పొరేట్ సంపన్నుల రూ.10లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యువకుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను, ఉద్యోగావకాశాలను మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందన్నారు.
త్వరలో సింగపూర్‌లో జరగబోయే 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడం పొరపాటని తెలుపుతూ దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాంటి ఉన్నత వేదికలపై ప్రాతినిథ్యం వహించే అవకాశం లేకుండా చేయడం సరికాదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. చంఢీగఢ్ లోని సెక్టార్ 2లోని ముఖ్యమంత్రి ఇంటి వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. సన్నిహితులు, బంధువులతో పాటు ఆప్ జాతీయ కన్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత రాఘవ్ చద్ధా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన డాక్టరైన గురుప్రీత్ కౌర్ ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు…
ఓ అధికారి మిమ్మల్ని ఎవరు పిలిచారంటారు..ఓ నేత సెక్యూరిటీ గార్డు ఉద్యోగమిస్తానంటాడు..ఇది నిరుద్యోగుల్ని అవమానించటం కాదా?సైనికుల త్యాగాన్ని తక్కువ చేయటం కాదా? విధ్వంసం తప్పే..కానీ, ఈ మాటలేంటి? అగ్నిపథ్ దేశమంతా మంటలు రేపుతోంది.నిరుద్యోగులు ఈ స్కీమ్ ని ఒప్పుకునేది లేదంటున్నారు..ప్రభుత్వం అమలు చేసి తీరుతాం అంటోంది.ఇక నుంచి రెగ్యులర్ సెలక్షన్లు ఉండవని, ఆర్మీలోకి రావాలంటే అగ్నిపథ్ ఒక్కటే మార్గమంటోంది. అగ్నిపథ్ పథకంపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక నిరసన…
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీం మంటలు రాజేస్తోంది. ఈ పథకంపై విపక్షాలు, నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ యువతకు ఉద్యోగాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తినా.. కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఈ పథకంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాల అధినేతలతో వరుసగా రెండో సారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం త్రివిధ దళాల అధిపతులు… అగ్నిపథ్ పథకంపై వెనకడుగు వేసే…
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోల్ కతాకు చెందిన ఓ సంస్థకు సంబంధించిన హవాలా లావాదేవీల్లో ఢిల్లీ ఆరోగ్య, హోం మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన నివాసంతో పాటు అతని సహాయకుడి నివాసంలో మంగళవారం ఈడీ భారీ ఎత్తున సోదాాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున బంగారం, నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మొత్తం రూ.…
దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని గతంలో ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్ జాతీయస్థాయి పర్యటనలో కీలక భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఫ్రంట్లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని అన్నప్పుడే వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతోపాటు ప్రగతి భవన్కు వచ్చిన పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చలను…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి…
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అవుతుంది అనుకున్న ఆమ్ఆద్మీ పార్టీ.. క్రమంగా విస్తరణ చర్యలు ప్రారంభించింది.. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తిరుగులేని విజయాన్ని అందుకుని ఔరా..! అనిపించింది.. ఈ విజయం ఆ పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.. పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఇదే సమయంలో 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇవాళ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్ తీర్థం…