Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్‌పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.
60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు.
Nabam Tuki: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తు్న్నారు. అరుణాచల్ ప్రదేవ్ మాజీ సీఎం నబమ్ తుకీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను అడ్డుకోలేని నైతిక కారణాలతో టుకీ రాజీనామా చేశారు.
PM Modi : అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో 13000 అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు అంటే శనివారం ప్రారంభించనున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు.
BJP Leader Assassination: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖోన్సా (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు యమ్‌సెన్ మేట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.
Man Kills Niece's Lover: ఇటీవల కాలంలో ప్రేమ సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. యువతీ యువకులు ప్రేమించుకోవడం, అది పెద్దలకు నచ్చకపోవడంతో వివాదాలు మొదలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కులాలు వేరు కావడంతో పరువు హత్యలకు దారి తీస్తోంది. ఇటీవల కాలంలో మనం చాలా సందర్భాల్లో ఇలాంటి హత్యల్ని చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే జరిగింది.
Sela Tunnel: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఇండో-చైనా బోర్డర్‌లో సైనిక, రవాణా వసతులను మెరుగుపరుస్తోంది. సరిహద్దు వెంబడి సైన్యం సునాయాసంగా కదిలేందుకు వీలుగా రోడ్లను నిర్మిస్తోంది. పలు ప్రాంతాల్లో ఎయిర్ ఫెసిలిటీలు, కమ్యూనికేషన్ వ్యవస్థను బలపరుస్తోంది.