అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దులపై చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ.. వాటికి పేర్లను మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఆ లిస్టును ప్రభుత్వ వెబ్ సైట్ లో డ్రాగన్ కంట్రీ ఉంచింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని చైనా స్పష్టం చేసింది. చైనాకు చెందిన ప్రాంతాలకు విదేశీ పేర్లు ఉండడం వల్ల చైనా సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని వెల్లడించింది.
Read Also: MI vs RR Dream 11 Prediction: ముంబై vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
అందు కోసమే.. ఆయా ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని, విదేశీ భాషల నుంచి మాండరిన్ లోకి తర్జుమా చేయొద్దని తన ప్రజలకు డ్రాగన్ కంట్రీ చైనా సూచించింది. ఈ క్రమంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్లు చైనా సర్కార్ పేర్కొందని గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అరుణాచల్ ను దక్షిణ టిబెట్ గా వ్యవహరిస్తూ.. జాంగ్నాన్ అని డ్రాగన్ కంట్రీ నామకరణం చేసింది. ఇక, అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా లిస్టు విడుదల చేయడం ఇప్పటి వరకు ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017 నుంచి ఇలా కొత్త పేర్లతో చైనా లిస్ట్ రిలీజ్ చేస్తూ వస్తుంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా చైనా వాటిని తేలిగ్గా తీసుకుంటుంది.