పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 2, 3 గంటల్లో ఈ పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Pawan kalyan: పిఠాపురంలో జనసేనాని షెడ్యూల్ ఖరారు.. ప్రచారం ఎప్పటినుంచంటే..!
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు ప్రజలు సురక్షితమైన భవనాల కిందకు వెళ్లాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులతో జాగ్రత్తగా ఉండాలని.. మొబైల్ ఫోన్లు ఉపయోగించొద్దని సూచించింది. ప్రజలు, అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: CM Jagan: ఎల్లుండి నుంచి ‘మేమంతా సిద్ధం’.. బస్సుయాత్ర చేపట్టనున్న సీఎం జగన్
Vidarbha, Chhatishgarh, Jharkhand, Odisha, Gangetic West Bengal, Sikkim, Arunachal Pradesh, Nagaland, Assam and Meghalya likley to experience thunderstorms, lightning, and gusty winds at isolated locations duirng next 2-3 hours. @moesgoi @ndmaindia @DDNewslive @airnewsalerts pic.twitter.com/kmivTnFF1p
— India Meteorological Department (@Indiametdept) March 25, 2024