Ladakh: లడఖ్‌కు రాష్ట్రహోదా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.
Indo-Pak Clash: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర్ ప్రధాన కారణమని నోరు పారేసుకున్నారు.
Pawan Kalyan Tweet on Article 370 6th Anniversary: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్ 370’ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లడఖ్) విభజించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా…
Jammu Kashmir : ఢిల్లీ – జమ్మూ కశ్మీర్ కు మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా రానుందా.. ఆరేళ్ల తర్వాత తెరపైకి ఎందుకు స్పెషల్ స్టేటస్ పై ఈ చర్చ మొదలైందో తెలుసా.. ఆగస్టు 5 , 2019 న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను కోల్పోయింది.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసింది కేంద్రం.. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది.. జమ్ము కాశ్మీర్ ప్రత్యేక…
Salman Khurshid: కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వేరుగా ఉందనే భావనను చాలా కాలం సృష్టించిందని, ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, పలు దేశాలకు భారత దౌత్య బృందాలు వెళ్లాయి.
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు.
ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత.. జరిగిన మొదటి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గానూ.. రెండు పార్టీలు కలిసి 48చోట్ల గెలిచాయి. జమ్మూలో తన పట్టును నిలుపుకొన్న భాజపా.. 29 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలకు పైగా గడిచింది.
Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది.
JK Assembly: ఆర్టికల్ 370 పునరుద్ధరణపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు మళ్లీ గందరగోళం నెలకొంది. కుప్వారాలోని పీడీపీ ఎమ్మెల్యే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై బ్యానర్‌ను ప్రదర్శించడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇవాళ మళ్లీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తోపులాటలో భాగంగా అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్‌ను మార్షల్స్ సభ నుంచి బయటకు పంపించారు. అసెంబ్లీలో పీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు గురువారం…