Pawan Kalyan Tweet on Article 370 6th Anniversary: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ‘ఆర్టికల్ 370’ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టు 5న ఈ అధికరణను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లడఖ్) విభజించిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు నేటితో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
‘ఒక చారిత్రాత్మక రాజ్యాంగ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు. భారత యూనియన్‌లో జమ్మూ కశ్మీర్‌కు పూర్తిగా, న్యాయబద్ధంగా ఏకీకరణకు హామీ ఇచ్చిన రోజు. చాలా కాలంగా అశాంతి, హింసతో ప్రభావితమైన ఈ ప్రాంతానికి శాంతిని తీసుకువచ్చి.. ప్రజలకు సమానత్వం, అభివృద్ధికి మార్గాన్ని తెరిచిన రోజు. దేశ నిర్మాణంలో నిర్ణయాత్మక, దార్శనిక నాయకత్వ బలాన్ని చూపించిన రోజు. 2019 ఆగస్టు 5న ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్‌లో దశాబ్దాల అశాంతి ముగిసింది. దేశవ్యాప్తంగా పౌరులతో సమానంగా జమ్మూ కశ్మీర్ ప్రజలకు సమాన హక్కులను నిర్ధారించడం ద్వారా చారిత్రాత్మక అడుగు వేసింది. దశాబ్దాలుగా ఉగ్రవాదం, హింస కాశ్మీర్ యువత ఆకాంక్షలను అణచివేసాయి. ఆర్టికల్ 370 రద్దుతో శాంతికి, సమగ్ర అభివృద్ధికి నాంది.జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాజ్యాంగ హక్కులు కల్పించిన రోజు. 6వ వార్షికోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read: Vivo T4R 5G Price: ‘వివో టీ4ఆర్’ అమ్మకాలు షురూ.. 4 వేల లాంచింగ్ ఆఫర్!
ఇక జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశం కావడంతో ఈ చర్చ మొదలైంది. రాష్ట్రపతితో భేటీ తర్వాత అమిత్ షా జమ్మూ కశ్మీర్ నేతలను కలిశారు. దాంతో జమ్మూ కశ్మీర్‌పైనే సమావేశం అయ్యారనే జరిగాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం వందతులను ఖండించారు. తనకైతే నమ్మకం లేదని, ఏమీ జరగదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా అని తెలిపారు.