Farooq Abdullah : జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్‌ను తీవ్రంగా టార్గెట్ చేశారు.
BJP In Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని అంతం చేసి, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. గతంలో ప్రతీ శుక్రవారం రాళ్లు రువ్వే సంస్కృతికి చరమగీతం పలికింది. అయినా కూడా తాజాగా జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ లోయ ప్రాంతంలోని ఓటర్లు బీజేపీకి వేటేసేందుకు పెద్దగా ఇష్టం చూపలేదు.
Amit Shah: హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. హర్యానాలోని కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. బాద్షాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కళ్లు మూసుకుపోయాయని అన్నారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తామని ప్రకటించారు.
Amit Shah: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
Article 370: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆయన తోసిపుచ్చారు.
Jammu Kashmir Elections: మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి.
Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఆ రాష్ట్రానికి శుభవార్త అందింది. దీని వల్ల జమ్మూ కాశ్మీర్‌లో నివసించే ప్రజల జీవితాలు మారవచ్చు.