ఇటీవలి కాలంలో టీమిండియా పేసర్ ‘అర్ష్‌దీప్ సింగ్’ పేరు బాగా వినిపిస్తోంది. టీ20, వన్డేలలో నిలకడగా రాణించడమే అందుకు కారణం. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ఐసీసీ టోర్నీలలో కూడా రాణిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో అర్ష్‌దీప్ అద్భుత స్పెల్ వేశాడు. తన 4 ఓవర్ల కోటాలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్…
IND vs AUS: ఆస్ట్రేలియాతో మూడో టీ20కి భారత జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనైనా ఆసీస్ ను సమర్థంగా ఎదుర్కుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇద్దరూ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు.
Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి మాజీ క్రికెటర్స్ సీరియస్ అవుతున్నారు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ నిర్ణయాలే అంటూ మండిపడుతున్నారు.
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ టైగా మారితే.. అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశాడు. మ్యాచ్‌లో అర్ష్‌దీప్ పెద్దగా ప్రభావం చూపలేదు. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. సూపర్ ఓవర్లో మాత్రం అదరగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. పెరీరా, శనకను అవుట్ చేసి హీరో అయ్యాడు.…
ఆసియా కప్ 2025లో భారత్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌లపై అద్భుతమైన విజయాలు సాధించిన భారత్.. సూపర్-4లో కూడా ఆధిపత్యాన్ని చూపుతోంది. సూపర్-4లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మరోసారి జయకేతనం ఎగురవేసింది. సూపర్-4లో భారత్ ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియా కోచ్ గౌతమ్…
శుక్రవారం జరిగిన ఆసియా కప్ 2025లో ఒమన్‌పై టీం ఇండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన 100వ T20I వికెట్‌ను చేరుకున్న అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయమైనదిగా నిలిచింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ మొదటి బంతికే అతను తన 100వ వికెట్ తీసుకున్నాడు. ఈ ఘనత కోసం ఎనిమిది నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి 100 T20I వికెట్లు తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.…
ఆసియా కప్ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్…
సెప్టెంబర్ 9 నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ 2025 ఆరంభం కానుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ హాంకాంగ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగనుండగా.. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆసియా కప్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఆసియా కప్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు…
BCCI Update India Squad for 4th vs England: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ కోసం మార్పులతో భారత జట్టును (అప్డేట్ టీమ్) బీసీసీఐ ప్రకటించింది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎడమ బొటన వేలు గాయం కారణంగా నాల్గవ టెస్ట్‌లో ఆడడం లేదు. అర్ష్‌దీప్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను…
Arshdeep Singh Out, Anshul Kamboj to play ENG vs IND 4th Test 2025: టెస్ట్ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ బుధవారం (జూలై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జూలై 17న ప్రాక్టీస్ సెషన్లో బంతిని ఆపుతుండగా.. అర్ష్‌దీప్…