India vs South Africa 3rd T20I: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయం పూర్తిగా ఫలించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు ఉక్కిరిబిక్కిరై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ (1), రీజా హెండ్రిక్స్ (0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా ఒత్తిడిలో పడింది. ఒకదశలో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత కెప్టెన్ ఏడెన్ మార్క్రామ్ ఒంటరిగా పోరాడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
మార్క్రామ్ 46 బంతుల్లో 61 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే మరో వైపు నుంచి సరైన మద్దతు లేకపోవడంతో స్కోరు మందగించింది. డేవాల్డ్ బ్రెవిస్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (9), కార్బిన్ బోష్ (4)లు విఫలమయ్యారు. చివర్లో డోనోవన్ ఫెరెయిరా 20 పరుగులు చేసినా స్కోరుపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక భారత బౌలర్లలో లాస్ట్ మ్యాచ్ లో దారుణంగా వైడ్స్ వేసి భారీగా పరుగులు ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్అ.. ఈసారి మాత్రం ద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా 4 ఓవర్లలో 11 పరుగులకే 2 వికెట్లు తీసి సఫారీ బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లు చేరి 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒక్కో వికెట్ సాధించారు. దీంతో టీమిండియా మ్యాచ్ గెలుపు కోసం 118 పరుగులు చేయాల్సి ఉంది. చూడాలిమరి ధర్మశాల మైదానంలో టీమిండియా బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఎంత త్వరగా ఛేదిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
Innings Break!
A terrific collective show by the #TeamIndia bowlers 👌
Chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/wLjHQjkyfO
— BCCI (@BCCI) December 14, 2025