IND Vs NZ: నేడు న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. నితీష్-ప్రసిధ్ అవుట్, భారత్ ప్లేయింగ్ XI ఇదే!
- భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి వన్డే
- మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం
- భారత్ ప్లేయింగ్ XI ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ నేడు జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. స్వదేశంలో మరో సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉండగా.. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ సాధించాలని కివీస్ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో చివరి వన్డే ఆసక్తికరంగా సాగవచ్చు.
రెండో వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్ సత్తాచాటాల్సి ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో మరో ఆల్‌రౌండర్ ఆయుష్ బదోని జట్టులోకి రావొచ్చు. బదోని అరంగేట్రం దాదాపుగా ఖరారు అయినట్లే తెలుస్తోంది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించే అవకాశముంది.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
రెండో వన్డేలో విజయంతో న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన డారిల్ మిచెల్.. మరోసారి జట్టును ఆదుకోనున్నాడు. డెవాన్ కాన్వే కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాలని కివీస్ జట్టు కోరుకుంటోంది. కెప్టెన్ బ్రేస్‌వెల్ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. పేసర్ జేమీసన్ భారత్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్‌లతో బౌలింగ్ బాగానే ఉంది. లెనాక్స్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌కు చోటు దక్కనుంది. కివీస్ జట్టులో 8 మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్నా.. గట్టి పోటీ ఇస్తున్నారు. సిరీస్ గెలిస్తే న్యూజిలాండ్‌కు ఇది పెద్ద ఘనత అవుతుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, నితీశ్ రెడ్డి/ఆయుష్ బదోని, ఆర్ జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, మైకెల్ హే, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జేమీసన్, ఫౌక్స్, లెనాక్స్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు