లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది.
ఒక దశాబ్దం పాటు అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వేసిన హనీ ట్రాప్‌లో పడ్డాడు. ఒక మేల్ కానిస్టేబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మహిళగా నేరస్థుడికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో నేరస్థుడు చిక్కినట్లు పోలీసులు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం.. బూట్‌లెగ్గింగ్ వంటి 20 కేసులు నిందితుడు బంటి (45)పై ఉన్నాయి. అయితే అతన్ని…
డబ్బులు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడటం లేదు. దొంగతనాలు, దోపిడీలు ఇలా ఏది పడితే అది డబ్బుల కోసం చేసేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన.. ఓ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడం కోసమని ఘరానా మోసాలకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ మోసాలతో పాటు నకిలీ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్న నలుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యార్థినులంతా ఒకే కాలేజీకి చెందిన వారు కాగా.. నలుగురు యువకులు కూడా అదే కాలేజీలో పూర్వ విద్యార్థులు. కాగా.. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ విద్యార్థిని తండ్రి మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను సాధారణ వైద్య పరీక్షల కోసం నగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రిమాండ్ విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి…
సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసుల అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను కాసేపటి క్రితం సిట్ తమ ఆధీనంలోకి తీసుకుని సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో.. ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి 6 రోజుల పాటు ప్రజ్వల్…
రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
3 నెలల పసికందును అమ్ముతున్న ముఠా ని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సభ్యసమాజం తల దించుకునేలా చేసారు కొందరు మహిళలు. వీరు ఆడబిడ్డలే అన్నది మరిచారో ఏమో, అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు. ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వీరి గుట్టు రాట్టయ్యింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడిపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ…
ఉత్తరాఖండ్లో గంజాయి స్మగ్లింగ్ బ్లాక్ వ్యాపారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. మంగోలి ప్రాంతంలో 31.99 గ్రాముల గంజాయి తరలిస్తున్న బరేలీకి చెందిన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.