డబ్బులు సంపాదించడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడటం లేదు. దొంగతనాలు, దోపిడీలు ఇలా ఏది పడితే అది డబ్బుల కోసం చేసేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన.. ఓ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడం కోసమని ఘరానా మోసాలకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ మోసాలతో పాటు నకిలీ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ పై అవగాహన ప్రోగ్రామ్స్ అంటూ యూట్యూబ్లో వీడియోలు, ప్రకటనలు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. ట్రైనింగ్ పేరుతో అనేక మందిని మోసం చేసింది శివకుమార్ కుటుంబ సభ్యులు.
Read Also: Pakistan: “భారత దాడికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలి”.. పీఓకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో 50% మాత్రమే పెట్టి, మరో 50% తన కస్టమర్లతో పెట్టించాడు అశోక్ కుమార్ అనే వ్యక్తి. 50% పెట్టుబడులకు 200 శాతం ప్రాఫిట్ చూపిస్తానని మోసాలకు పాల్పడ్డాడు. మీమాంస, జోషిక ఇన్వెస్టర్స్ క్లబ్ లో పెట్టుబడులు పెట్టించాడు. ఈ క్రమంలో.. రూ. 10 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడు శివకుమార్. గతంలోను శివకుమార్ పై అనేక కేసులు ఉన్నాయి. 88 రోజులపాటు జైల్లో ఉన్నప్పటికీ, మళ్లీ బయటికొచ్చి ఇలాంటి దందాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో.. ఈ కుటుంబం మోసాలను గ్రహించిన పోలీసులు.. వీరికి సంబంధించిన ఆస్తులను ఫ్రీజ్ చేశారు. శివకుమార్ జైలు నుండి బయటకు రాగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. మీ మాంసా వెల్నెస్ రిసార్ట్స్ , మెడికల్ క్యాంపుల పేరుతో మోసాలు చేశాడు. ఈ క్రమంలో.. శివ కుమార్ తో పాటు భార్య స్వర్ణలత కుమారుడు జశ్వంత్, శ్రీనివాస్ రావులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.