రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. ఠాణాకు తరలించారు. ఓ ఈవెంట్ మేనేజర్ కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!
కాగా.. భాగ్యనగరంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు.. ఒకవేళ డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు.