ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన వారు కాగా.. వారు హింసను సృష్టించడానికి ముఖ్యమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునే పనిలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను మహ్మద్ నుస్రత్, మహ్మద్ నఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రస్దీన్‌లుగా గుర్తించారు.
దేశంలో ఐదో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. ఓ వార్త కలవరపెడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. కేంద్ర ఏజెన్సీల నుండి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా గుజరాత్ ఏటిఎస్ (ATS) ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఈ నలుగురు ఉగ్రవాదులకు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేసినా కూడా నిందితుడిని అరెస్టు చేయాలంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
పెట్రోల్ పంప్ వర్కర్‌పై దాడి చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అతని కుమారుడు అనాస్‌లను అరెస్ట్ చేసేందుకు నోయిడా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా నోయిడా పోలీసులు అమానతుల్లా ఖాన్ ఇంటికి చేరుకోగా.. అతను ఇంట్లో కనిపించలేదు.
రైలు ప్రయాణం చేసేటప్పుడు తమతో పాటు తమ లగేజీలను బ్యాగ్ లలో తీసుకువెళతారు. అయితే.. అందులో ఏముంటుందన్న విషయం పక్కన కూర్చే వారికి తెలియదు. కానీ.. స్మగ్లర్లు రైలు ప్రయాణం ద్వారానే.. కోట్లాది విలువ చేసే డ్రగ్స్ ను రాష్ట్రాలు దాటిస్తున్నారు. సమాచారం అందితే దొరికేవి కొన్నైతే.. దొరకనివి చాలా ఉన్నాయి. తరుచూ మనం చూస్తూనే ఉంటాం.. రైళ్లలో డ్రగ్స్ తరలిస్తున్నారని.. పట్టుబడ్డారన్న వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. మే 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది.
ఉత్తరప్రదేశ్లోని ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ల యువతికి చదువు చెబుతానని చెప్పి రెండేళ్లుగా బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేస్తున్న నిందితుడు మౌలానాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వీడియో తీసి బాలికను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గ్రామంలోని మసీదులోని మౌలానా వద్ద చదువుకునేది. రెండేళ్ల క్రితం నిందితుడు యువతిని బెదిరించి అత్యాచారం చేసి దానిని వీడియో తీశాడు. ఆ తర్వాత…
బంజారాహిల్స్ ఆఫ్టర్ నైన్ పబ్ లో గలీజ్ దందా నడుస్తోంది. యువకులను ఆకర్షించేందుకై పాడు పనులు యజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి ఈ దందాను యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉపాధి పేరుతో యువతలను ఇక్కడ రప్పించి వ్యభిచార రొంపులోకి యాజమాన్యం దింపుతున్నట్లు తెలుస్తోంది. యువతులతో అశ్లీల నృత్యాలతో పాటు అక్రమ వ్యాపారం యాజమాన్యం చేయిస్తున్నట్లుగా సమాచారం. Also Read: Kadiyam Srihari: ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ లేచే పరిస్థితి లేదు..…
Gujarat : గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 13 ఏళ్ల బాలుడిని బంగారు ఆభరణాలు, రూ.14 లక్షల చోరీకి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అరెస్టు చేశారు.