భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్, పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. అరెస్టయిన వ్యక్తి పాకిస్తానీ పౌరుడని తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబంసిరి జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. నిందితులను అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది. వైరల్ వీడియోలో.. ఒక యువకుడు ఒక గుడిలో నేలపై పడుకుని ఉన్నాడు. మరో వ్యక్తి కూడా అక్కడ ఆవరణలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి మొబైల్ లో…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు.
NIA Raids : బీహార్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో నిషేధిత నక్సలైట్ సంస్థ సీపీఐ మావోయిస్టు ప్రత్యేక ఏరియా కమిటీ సభ్యుడు ఉదయ్ జీ అలియాస్ రాజేష్ కుమార్ సిన్హాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.20, చాక్లెట్లు ఇస్తానని ప్రలోభానికి గురి చేసి 8 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 12న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికతో క్రూరత్వానికి హద్దులు దాటిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి ఊరేగింపులో ఆర్కెస్ట్రా వాయిస్తుండగా చూసేందుకని బాలిక అక్కడికి వచ్చింది.
హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు.
రిలయన్స్ అధినేత , పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. వివాహానికి ముందు రోజు ‘అంబానీ ఇంట జరుగుతోన్న వివాహ వేడుకలో బాంబు పేలనుంది’ అంటూ ఓ వ్యక్తి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వేడుక జరగడానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. ఎట్టకేలకు…