నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించినందుకు.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నందుకు గత నెలలో యూట్యూబర్ గుజార్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఆ కేసులో కోర్టు అతనికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రాజస్థాన్‌కు చెందిన బన్వరీలాల్ గుజ్జర్‌పై క్రిమినల్ బెదిరింపులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మార్గదర్శకాల ప్రకారం పంజాబ్‌ను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రచారంలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (SSOC) అమృత్‌సర్ అంతర్-రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్‌లో విదేశీ మూలం ఉన్న ఉగ్రవాది లఖ్‌బీర్ అలియాస్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు అధునాతన .32 బోర్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్‌లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
బీహార్‌లోని బెగుసరాయ్‌లో మేనమామ తన సొంత మేనకోడలిపై హత్యచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జహాన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు డయల్-112కు సమాచారం అందింది.
Crazy Offer : మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు... ఆన్‌లైన్ మోసం రోజు రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. దుండగులు సాధ్యమైనన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా.. గర్భవతులను చేస్తే రూ.10వేలు ఇస్తామంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.
హైదరాబాద్లో కల్తీ వైన్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళా వద్ద నుంచి 90 కల్తీ వైన్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ గృహిణిగా గుర్తించారు.
ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పాట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడారు.. నితీష్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధాకృష్ణ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీబీఐ స్పందనను న్యాయస్థానం కోరింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థనకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును జూలై 17న విచారణకు వాయిదా వేసింది.
రాజస్థాన్ అల్వార్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆవు దూడతో అసహజ శృంగారంకు పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. కొందరు యువకులు అకృత్యాలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. దీంతో.. ఈ వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన అజ్మీర్ జిల్లాలోని అల్వార్గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆవులతో అకృత్యాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జులై 1న ఆ ప్రాంత వాసి ప్రియాంషు అనే కామాంధుడు రాత్రి…
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 60 మంది భారతీయులను శ్రీలంకలోక్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అరెస్టు చేసింది. కొలంబోలోని మడివెల, బత్తరముల్లా, పశ్చిమ తీర నగరమైన నెగోంబో నుంచి వారిని గురువారం అరెస్టు చేశారు. ఈ దాడిలో 135 మొబైల్స్, 57 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికార ప్రతినిధి ఎస్‌ఎస్‌పి నిహాల్ తల్దువా తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. అనుమానంతో నెగొంబోలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు…