విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్న నలుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యార్థినులంతా ఒకే కాలేజీకి చెందిన వారు కాగా.. నలుగురు యువకులు కూడా అదే కాలేజీలో పూర్వ విద్యార్థులు. కాగా.. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ విద్యార్థిని తండ్రి మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Mexico: మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్‌బామ్
బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. తన కుమార్తె 12 తరగతి చదువుతుందని.. కాలేజీ పూర్తి చేసిన సీనియర్లు కొందరు, తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారని చెప్పాడు. మే 28న తన స్కూల్‌మేట్‌లలో ఒకరు, నిందితులలో ఒక స్నేహితుడి నుండి తన ఫోటోలు మార్ఫింగ్ చేసినట్లు తెలుసుకుందని అన్నాడు. కాగా.. తన కూతురు ఫొటోలు మార్ఫింగ్ చేశారని, కాలేజ్ యజమాన్యానికి చెబితే వారు పట్టించుకోలేదని.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు.
Read Also: Heavy Rain: బెంగళూరులో భారీ వర్షం.. 133 ఏళ్ల రికార్డు బద్దలు
ఇదిలా ఉంటే.. బాధితురాలి అన్నయ్య నిందితులలో ఒకరిని కలిసి.. అతని ఫోన్‌ను సెర్చ్ చేశాడు. వాట్సప్ గ్రూప్‌లో అతని సోదరి, ఇతర మహిళల అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేసినట్లు కనిపించింది. కాగా.. నిందితుల్లో ఒకరు ఆ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం ఉంది. ఆ తర్వాత అతని స్నేహితులు, యువతి ఫోటోలను డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేశాడు. ఈ ఘటనపై డీసీపీ తూర్పు కుల్దీప్ జైలు మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐపిసి సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపు) కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా.. నిందితులు పట్టుకుని విచారించగా, తాము నేరం చేసినట్లు ఒప్పుకున్నారని.. ఆ ఫొటోలు తొలగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.