జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ ఓకే చెప్పారని పేర్కొన్నారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. కేంద్రం అధికారికంగా ఆమె పేరును ప్రకటించింది. ఇక జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు. విజయ కిషోర్ రహత్కర్ మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన కుమారుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. ఉదయనిధిని ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించారు.
ఆపిల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించింది. దీనితో పాటు, తమ సీఎఫ్‌ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా కంపెనీ తెలియజేసింది. లూకా స్థానంలో భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ కొత్త సీఎఫ్ఓగా నియమితులయ్యారు.
ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ ను జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (స్పెషల్ డీజీ)గా నియమితులయ్యారు. సెప్టెంబరు 30న ఆర్‌ఆర్ స్వైన్ పదవీ విరమణ తర్వాత ఆయన దళం చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభా నాయకుడిగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌లో హౌస్ లీడర్‌గా నియమితులయ్యారని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు.
లోక్‌సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ప్రమోషన్ లభించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి షాక్ ఇచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది.…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతేకాకుండా.. గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం ప్రజాపక్షం 'ఎడిటర్' గా ఉన్నారు. కాగా.. అంతకుముందు అల్లం నారాయణ మీడియా…