సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు కాంగ్రెస్‌లో మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నాయి. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా కెఎస్. అళగిరి స్థానంలో సెల్వపెరుంతగై నియమితులయ్యారు
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జ్ సహా ఇంఛార్జిలను నియమించింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్‌ను కేరళ ఇంఛార్జ్‌గా నియమించింది. అండమాన్ నికోబార్‌కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్‌కు అశోక్ సింఘాల్, చండీగఢ్‌కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్‌కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మలను నియమించింది బీజేపీ హైకమాండ్.
సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి శుక్రవారం సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అందుకు సంబంధించి.. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో ఈ సమాచారం అందించింది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన చౌదరి.. ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాడికొండ పంచాయితీ ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వదరకు చేరడంతో ఇది చర్చకు దారితీస్తోంది. అయితే.. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి…
తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టు నూతన ఛీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ నియామిస్తూ.. సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇవాళ్టి వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పనిచేశారు. అయితే… తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ హైకోర్టు కొత్త ఛీఫ్…