SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది. 2023 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు పగ్గాలు అప్పజెప్పింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐదెన్ మార్క్రమ్ కెప్టెన్ గా బాధత్యలు వహించాడు. కాగా.. అతన్ని తొలగించి.. కమిన్స్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే కమిన్స్ ను రూ. 20.50 కోట్లు పెట్టి సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కసితో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
PM Narendra Modi: రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కాగా, ఎస్ఆర్‌హెచ్ కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. గడిచిన రెండు సీజన్లలో ఎస్ఆర్హెచ్ ఇద్దరు కొత్త కెప్టెన్లతోనే బరిలోకి దిగింది. 2022లో కేన్ విలియమ్సన్, 2023లో మార్క్రమ్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు మూడో కొత్త కెప్టెన్ తో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు కోచింగ్ స్టాఫ్‌ను కూడా మార్చింది. హెడ్ కోచ్‌గా ఉన్న బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరి.. బౌలింగ్ కోచ్‌గా ఉన్న డేల్ స్టెయిన్ స్థానంలో జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను నియమించుకున్నారు. ఇక సన్‌రైజర్స్ చివరగా ఐపీఎల్ టైటిల్ ను 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో గెలిచింది. అప్పటి నుంచి మళ్లీ గెలవలేదు. ఇక ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ మార్చి 23న కోల్‌కతాతో తలపడనుంది.
AP High Court: టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!